శబరిమల భక్తుల కోసం కాగజ్ నగర్–కొల్లాం ప్రత్యేక రైలు

డిసెంబర్ 13, 2025న కాగజ్ నగర్ నుంచి కొల్లాం జంక్షన్ వరకు అయ్యప్ప మాలధారుల సౌకర్యార్థం ప్రత్యేక రైలు నడపనున్నట్లు సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవను కోరిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ రైలు కాగజ్ నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, రామగుండం, పెద్దపల్లి, జమ్మికుంట, వరంగల్ మీదుగా ప్రయాణిస్తుంది. ఇందులో ఫస్ట్ ఏసీ నుంచి జనరల్ వరకు అన్ని రకాల కోచ్‌లు అందుబాటులో ఉంటాయి. మకరజ్యోతి దర్శనం కోసం మరో ప్రత్యేక రైలు నడపాలని కూడా విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్