నిధుల విడుదల వరకు విధుల బహిష్కరణ.. కౌటాల సర్పంచుల హెచ్చరిక

కౌటాల మండలంలోని 20 గ్రామ పంచాయతీల సర్పంచులు, స్థానిక ఎంపీడీఓ నిధుల కేటాయింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీలకు మంజూరైన నిధులు సకాలంలో అందకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, సర్పంచులకు తగిన గౌరవం ఇవ్వకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. గ్రామ పంచాయతీలకు రావాల్సిన నిధులు విడుదల చేసే వరకు తమ విధులను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. సొంత నిధులతో చేపట్టిన అభివృద్ధి పనుల బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ, లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్