సిర్పూర్ నియోజకవర్గ రైతుల సమస్యలను తెలుసుకునేందుకు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప దహెగాం మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు, కల్లాలను సందర్శించారు. రైతుల కష్టాలను అడిగి తెలుసుకున్న కోనప్ప, కల్లాల్లో ధాన్యం నిల్వ ఉండటం వల్ల నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి, మిల్లులకు తరలించాలని, ధాన్యం సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను కోరారు.