భాజపాలో చేరిన కోయపల్లి సర్పంచ్, వార్డు మెంబర్లు

కాగజ్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో, చింతలమానేపల్లి మండలం కోయపల్లి గ్రామానికి చెందిన సర్పంచ్ సోయం తిరుపతి, ఉపసర్పంచ్ జయరాం, పలువురు యువకులు ఆదివారం భారతీయ జనతా పార్టీలో చేరారు. సిర్పూర్ శాసనసభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు వారికి భాజపా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, గ్రామ పంచాయతీలకు నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచే వస్తున్నాయని, కేంద్ర, రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉంటే గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్