పెంచికల్పేట్ మండలంలో పెద్దపులి సంచారం: ప్రజల్లో ఆందోళన

పెంచికల్పేట్ మండలంలోని ఒడ్డుగూడ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. బుధవారం పెద్దవాగు ఒడ్డున పులి అడుగుజాడలను గమనించిన అటవీ అధికారులు దాని సంచారాన్ని నిర్ధారించారు. ఈ నేపథ్యంలో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అటవీ అధికారులు గ్రామాల్లో డప్పు ప్రచారం ద్వారా ప్రజలను అప్రమత్తం చేస్తూ, జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. ఒంటరిగా బయటకు వెళ్లవద్దని, పంట పొలాలకు గుంపులుగా వెళ్లాలని, రాత్రి వేళల్లో తిరగవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్