గన్నారం బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా మద్దెల మనీష్‌: ఎమ్మెల్యే

కాగజ్‌నగర్‌ మండలం గన్నారం గ్రామానికి చెందిన మద్దెల మనీష్‌ను సిర్పూర్ శాసన సభ్యుడు పాల్వాయి హరీష్ బాబు బుధవారం కాగజ్‌నగర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో బీజేపీ పార్టీలో చేర్పించి, సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, గ్రామ అభివృద్ధికి కలిసి కృషి చేయాలని, మద్దెల మనీష్ గెలిచి గ్రామానికి సేవ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ ధోతుల శ్రీనివాస్, ముక్కెర శేఖర్, నాయకులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్