కాగజ్‌నగర్‌ లో ఘనంగా మహాంకాళి బోనాల జాతర

కాగజ్‌నగర్‌లో ఆదివారం మహంకాళి బోనాల పండుగ ఘనంగా జరిగింది. వివేకానంద చౌరస్తా నుంచి మహంకాళి ఆలయనికి బోనాలను ఎత్తుకొని శివసత్తులు నృత్యాలు చేస్తూ శోభాయాత్ర నిర్వహించారు. చిన్నారులు కొలాటాలు ఆడారు. ఆయా పార్టీల నాయకులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. పోలిసులు బందోబస్తు నిర్వహించారు. కార్యక్రమంలో బోనాల జాతరకమిటీ అధ్యక్షులు తుమ్మ రమేష్‌, కమిటీ సభ్యులు, మహిళలు, భక్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్