కాగజ్‌నగర్‌: దీపకాంతులతో శోభాయమానంగా ‌మహంకాళి ‌ఆలయం

కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఎఫ్ కాలనీలో వెలసిన శ్రీ మహంకాళి అమ్మవారి ఆలయంలో ఆదివారం బోనాల పండుగ ఘనంగా నిర్వహించనున్నారు. కాగా ఈ బోనాల పండుగకు ఆలయం విద్యుత్ దీప కాంతులతో శోభాయమానంగా వెలుగుతుంది. ఉదయం నుండి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. కాగా మధ్యాహ్నం 1:30 కు మహిళలు పెద్ద ఎత్తున బోనాలు ఎత్తుకొని అమ్మవారికి సమర్పించనున్నారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలు పుట్టి పడేలా నిర్వాహకులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు.

సంబంధిత పోస్ట్