విద్యార్థిని మమతకు ఎమ్మెల్యే అభినందనలు

కాగజ్‌నగర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో, సిర్పూర్ మండలం భూపాలపట్నం గ్రామానికి చెందిన విద్యార్థిని అల్సా మమత రూపొందించిన రద్దీ ప్రాంతాల్లో పార్కింగ్ నిర్వహణ ప్రాజెక్టుకు పేటెంట్ లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు విద్యార్థిని అభినందించారు. గ్రామీణ ప్రాంతం నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం గొప్ప విషయమని ఆయన తెలిపారు. విద్యార్థికి మార్గనిర్దేశం చేసిన ఉపాధ్యాయుడు మౌల్కర్ కేశవ్, జిల్లా సైన్స్ అధికారి కటకం మధుకర్‌లను కూడా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూరం భాస్కర్, జాగరి రమేష్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్