సిర్పూర్: ఆరె కులానికి కేంద్ర OBCలో స్థానం కోరిన ఎమ్మెల్యే హరీష్ బాబు

న్యూఢిల్లీలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి నివాసంలో గురువారం ఆయనను సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా తెలంగాణలోని ఆరె కులస్తులను కేంద్ర ఓబీసి జాబితాలో చేర్చాలని విజ్ఞప్తి చేశారు. మంత్రివర్యులు సానుకూలంగా స్పందిస్తూ, ఈ అంశంపై సామాజిక న్యాయ మంత్రిత్వ శాఖతో చర్చిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా పలువురు ఆరె కులస్తులు నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్