కాగజ్‌నగర్ పట్టణంలోని సర్‌సిల్క్ అర్బన్ హెల్త్ సెంటర్‌లో ఆదివారం జాతీయ పల్స్ పోలియో కార్యక్రమాన్ని పురస్కరించుకుని, ఐదేళ్లలోపు చిన్నారులకు సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్‌బాబు పోలియో చుక్కలు వేశారు. ప్రతి చిన్నారికి రెండు చుక్కల పోలియో డ్రాప్స్ వేయించడం ద్వారా పోలియో రహిత సమాజ నిర్మాణానికి అందరూ సహకరించాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం పోలియో బూత్‌లలో, తదుపరి రెండు రోజుల పాటు వైద్య, ఆరోగ్య సిబ్బంది ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేస్తారని తెలిపారు.