ఆషాఢమాస బోనాల సందర్భంగా కాగజ్‌నగర్ సర్సిల్క్ కాలనీలోని మహంకాళి ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించాయి. ఈ సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అమ్మవారిని దర్శించుకొని ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని మహంకాళి తల్లి ఆశీస్సులు కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రజాప్రతినిధులు ఇతరులు పాల్గొన్నారు.