లైనుగూడ పంచాయతీలో ఎంపిడిఓ కోట ప్రసాద్ పర్యటన

కాగజ్‌నగర్‌ మండలంలోని లైనుగూడ గ్రామ పంచాయతీని ఎంపిడీఓ కోట ప్రసాద్ బుధవారం సందర్శించారు. పారిశుధ్యాన్ని పరిశీలించిన అనంతరం నర్సరీను పరిశీలించి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టాలని కార్యదర్శి రాజేశ్వర్‌కి సూచించారు. మారెపల్లి నుంచి లైనుగూడ వరకు రోడ్డుపై ఇరువైపులా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ చంద్రశేఖర్, హౌసింగ్ ఏఈ మహేష్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్