మున్సిపల్ వర్కర్లకు 36 నెలల పిఎఫ్ చెల్లించాలి: సిఐటియు వినతి

కాగజ్‌నగర్ మున్సిపల్ కార్యాలయంలో తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా కార్యదర్శి ఇ. శంకర్ మాట్లాడుతూ, మున్సిపల్ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న 36 నెలల పిఎఫ్ నిధులు, రెండు నెలల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని పని గంటలు తగ్గించాలని, గత సమ్మె సందర్భంగా ఇచ్చిన హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు సంజీవ్, రమేష్, మల్లేశ్, శ్యామల తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్