మున్సిపల్ కార్మికుల సమ్మె: రాజీవ్ గాంధీ చౌరస్తాలో బైఠాయింపు

కాగజ్నగర్ పట్టణంలో మున్సిపల్ కార్మికుల సమ్మె 12వ రోజుకు చేరుకుంది. సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్ కార్యాలయం నుంచి రాజీవ్ గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి బైఠాయించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజేందర్ మాట్లాడుతూ, కార్మికుల 5 నెలల వేతనాలు, రూ. 2 కోట్ల పీఎఫ్, ఈఎస్ఐ బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ, మున్సిపల్ యూనియన్ నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్