సిర్పూర్ నియోజకవర్గంలోని కౌటాల, చింతలమానేపల్లి, పెంచికల్‌పేట మండలాలకు ఒక్కోటి రూ. 2. 25 కోట్ల వ్యయంతో నూతన తహసీల్దార్ కార్యాలయ భవనాలు, కాగజ్‌నగర్ పట్టణంలో రూ. 2. 25 కోట్ల అంచనాతో నూతన ఆర్డీవో కార్యాలయ భవనాన్ని ప్రభుత్వం మంజూరు చేసిందని సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్‌బాబు తెలిపారు. ఈ మంజూరుతో నియోజకవర్గ ప్రజలకు మెరుగైన రెవెన్యూ సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు.