కాగజ్‌నగర్ మండలం సీతానగర్ గ్రామంలో శనివారం ఉపాధి హామీ పనుల్లో కూలీలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎర్రటి ఎండలో పనిచేస్తున్న కూలీలకు మంచినీరు, నీడ వంటి కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కన్వీనర్ ముంజం ఆనంద్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పథకంపై కేంద్ర ప్రభుత్వ విధానాలు కూలీలకు ఇబ్బందులు కలిగిస్తున్నాయని ఆయన విమర్శించారు. పని సమయంలో ఏదైనా అపాయం జరిగితే బాధ్యత ఎవరు తీసుకుంటారని ప్రశ్నించారు.