కుర్చీ వివాదం కాదు – పట్టణ అభివృద్ధే ప్రాధాన్యం కావాలి

కాగజ్‌నగర్ మున్సిపల్ కౌన్సిల్ తొలి సమావేశంలో కుర్చీ వివాదంపై బీఆర్ఎస్ సభ్యుల తీరును కౌన్సిలర్ ఈర్ల విశ్వేశ్వర్ రావు తీవ్రంగా విమర్శించారు. ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం మున్సిపల్ సంస్థను ఆశ్రయిస్తున్న ఈ తరుణంలో, తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, వీధి దీపాలు వంటి మౌలిక అవసరాలపై చర్చించాల్సిందిగా ఆయన సూచించారు. మొదటి సమావేశం ప్రజల ఆశలకు అనుగుణంగా సాగి, అభివృద్ధి దిశగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని, అయితే వ్యక్తిగత హోదాలు, కుర్చీల కోసం వివాదాలు సృష్టించడం వల్ల సమావేశ ఉద్దేశ్యం దెబ్బతింటుందని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్