అటవీ అధికారిపై దాడి కేసులో ఒకరి రిమాండు

కొమ్ముగూడకు చెందిన చునార్కర్ దుర్యోధన్ అటవీ భూమిని ట్రాక్టర్తో దున్నుతుండగా, ముత్యంపేట బీట్ అధికారి భూమేశ్వర్ అడ్డుకున్నారు. ఆగ్రహించిన దుర్యోధన్ వెదురు బొంగుతో దాడి చేయడంతో భూమేశ్వర్కు గాయాలయ్యాయి. ఈ ఘటనపై సిర్పూర్(టి) పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడు దుర్యోధన్ను అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు. ఈ సంఘటన ఈ నెల 11న జరిగింది.

సంబంధిత పోస్ట్