కాగజ్‌నగర్‌: ఎస్పీఎంలో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలి: జేఏసీ

కాగజ్‌నగర్‌ పట్టణంలోని సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానిక నిరుద్యోగ యువకులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని నిరుద్యోగ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం పద్మశాలి భవన్లో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడారు. కంపెనీలో స్థానికేతరులు పనిచేయడంతో స్థానికులు నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్