కాగజ్‌నగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీ-ఫారం కేటాయింపుపై తుది నిర్ణయం పార్టీ అధిష్టానానిదేనని ఎమ్మెల్సీ దాసోజు శ్రావణ్ స్పష్టం చేశారు. స్థానిక సమీకరణాలు, పార్టీ బలం, గెలుపు అవకాశాలను పరిగణలోకి తీసుకుని అభ్యర్థులను నిర్ణయిస్తామని తెలిపారు. కార్యకర్తల అభిప్రాయాలను గౌరవిస్తామని, అందరూ పార్టీ క్రమశిక్షణను పాటిస్తూ ఐక్యంగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ప్రకటనతో టికెట్ల కేటాయింపుపై నెలకొన్న సందిగ్ధతకు తెరపడింది.