మారుమూల గ్రామపంచాయతీలైన మురళి గూడా, కమ్మర్గాంలలో ప్రాణహిత బ్యాక్ వాటర్ వల్ల పంట నష్టాలను పర్యవేక్షించుటకు పెంచికలపేట్ ఎంపీడీవో పంచాయతీ సెక్రటరీలతో కలిసి శుక్రవారం ప్రాణహిత ముంపు ప్రాంతాలకు వెళ్లి అక్కడి ప్రజలతో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బ్యాక్ వాటర్ సమస్యలతో పాటు, ముంపు ప్రాంతాలలో త్రాగు నీటి సమస్యలు, వర్షకాలంలో వచ్చే విషజ్వరాల గురించి తీసుకోవల్సిన జాగ్రత్తలను సూచించారు. వారితో పాటు రాకేష్, గణేష్, సెక్రటరీ లతో పాటు లచ్చిరాం పటేల్, జాడి శ్రీను, తొర్రెమ్ రాజు, ఆత్రం వసంత్ ఉన్నారు.