సైబర్ మోసగాళ్ల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని శనివారం సిర్పూర్(యు) ఎస్ఐ రామకృష్ణ సూచించారు. ఫేక్ ఐడీలు, అపరిచిత వాట్సప్ నంబర్ల ద్వారా వచ్చే కాల్స్‌కి స్పందించొద్దని, సన్నిహితుల పేరుతో డబ్బులు అడిగితే నమ్మొద్దని హెచ్చరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు.