గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: సీఐటీయూ

గ్రామ పంచాయతీ ఉద్యోగులు, కార్మికుల యూనియన్ పిలుపు మేరకు సీఐటీయూ ఆధ్వర్యంలో సోమవారం బెజ్జూర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. జూనియర్ అసిస్టెంట్‌కు వినతిపత్రం అందజేసిన నాయకులు, గ్రామ పంచాయతీ కార్మికులపై అమలు చేస్తున్న మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని, సమాన పనికి సమాన వేతనం ప్రకారం కనీసం రూ. 26,000 వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. జీపీ కార్మికులకు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి, ప్రతి నెల ఒకటో తేదీనే వేతనాలు చెల్లించాలని కోరారు.

సంబంధిత పోస్ట్