కాగజ్‌నగర్ పట్టణంలోని భట్టుపల్లి జెడ్పీహెస్‌ఎస్ పాఠశాలలో శుక్రవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వేంకటేశ్ దౌత్రే, సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు, ఉమ్మడి ఆదిలాబాద్ ఎమ్మెల్సీ దండె విఠల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కలెక్టర్ మాట్లాడుతూ మొదటి రోజే పిల్లలకు పుస్తకాలు, యూనిఫాంలు అందించారని, పిల్లలు మంచిగా చదివి ఉన్నతశిఖరాలకు ఎదగాలన్నారు.