సీబాబు కాలనీలో పల్స్ పోలియో బూత్ ప్రారంభం

కాగజ్‌నగర్‌ మండలం బట్టుపల్లి గ్రామపంచాయతి పరిథిలోని సీబాబు కాలనీలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆశా వర్కర్‌తో కలిసి సర్పంచ్ రాజేందర్ జాదవ్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఐదేళ్లలోపు ప్రతి చిన్నారికి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని తల్లిదండ్రులకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి హరీష్, 12వ వార్డు సభ్యుడు చెట్టి వెంకటేష్, 11వ వార్డు సభ్యురాలు గోగర్ల భాగ్య నరేష్, కాలనీ వాసులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్