రెబ్బెన బస్‌స్టాండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ మేరకు సంబరాలు నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ లో ఆమోదం తెలిపినందుకు మంత్రి మండలిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మండల అధ్యక్షుడు లావుడ్య రమేష్ అభినందించారు. నేతల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి, సామాజిక న్యాయం కాంగ్రెస్‌తో సాధ్యమని తెలిపారు.