ఎస్పీఎం మిల్లులో గుర్తింపు ఎన్నికలు వెంటనే నిర్వహించాలి

కాగజ్‌నగర్‌లోని సిర్పూర్ పేపర్ మిల్లులో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వెంటనే నిర్వహించాలని సిర్పూర్ పేపర్ మిల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు జే. మల్లికార్జున్ డిమాండ్ చేశారు. 2018లో జేకే మిల్లు యాజమాన్యం మిల్లును టేకోవర్ చేసినప్పటి నుంచి ఇప్పటికీ గుర్తింపు యూనియన్ లేకపోవడంతో కార్మికుల సమస్యలు పరిష్కారం కావడం లేదని ఆయన పేర్కొన్నారు. ఎన్నికలు అడ్డుకునేందుకు యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం జోక్యం చేసుకొని వెంటనే ఎన్నికలు నిర్వహించాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్