దేశవ్యాప్తంగా కొనసాగుతున్న కార్యక్రమంలో భాగంగా, కాగజ్‌నగర్ తహసిల్దార్ కార్యాలయంలో గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించి, గోవధ నిషేధాన్ని వెంటనే అమలు చేయాలని కోరుతూ సుమారు వెయ్యి మంది సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ డాక్టర్ అనిత, అశోక్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.