ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండేవిఠల్ తో కలిసి సిర్పూర్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు శనివారం ఆర్టీసీ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు వినతిపత్రం అందజేశారు. హైదరాబాద్ లోని వారి కార్యాలయంలో కలిసి సిర్పూర్ కేంద్రంలో రెండు కోట్ల నిధులతో నూతన బస్టాండ్ నిర్మించాలని మంత్రికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించిన మంత్రి త్వరలో మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు