కుమురం భీం జిల్లాలో ఉద్యోగ ఉపాధి పై రౌండ్ టేబుల్

కాగజ్ నగర్ పద్మశాలి భవనంలో విద్యార్ది నిరుద్యోగ జెఎసి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో, సిర్పూర్ పేపర్ మిల్లులో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. జిల్లాలో ఉన్నత చదువులు చదివిన యువత ఉపాధి లేక నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిశ్రమలు స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని, ప్రభుత్వ రాయితీలతో నడుస్తున్న ఎస్పీఎంలో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్