నిరుపేద బాలుడికి చికిత్సకు రూ. 2 లక్షల సహాయం

కాగజ్ నగర్‌లోని ఎమ్మెల్యే నివాసంలో సిర్పూర్ మండలం శివపూర్ గ్రామానికి చెందిన వరుణ్‌కు హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎం రిలీఫ్ ఫండ్) ద్వారా రూ. 2 లక్షల లెటర్ ఆఫ్ క్రెడిట్ మంజూరైంది. సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు చొరవతో ఈ సహాయం అందింది. ఎమ్మెల్యే పీఏ వరుణ్ తల్లికి ఈ ఎల్ఓసీ లేఖను ఆదివారం అందజేశారు. దీంతో కుటుంబానికి ఆర్థిక భారం తగ్గి, వరుణ్ చికిత్సకు మార్గం సుగమమైంది.

సంబంధిత పోస్ట్