ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ భద్రత పునరుద్ధరణకు కౌటాలలో రాస్తారోకో

బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు డాక్టర్ ఆర్. ఎస్. ప్రవీణ్ కుమార్ భద్రతను వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కౌటాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మద్దతుతో చేపట్టిన ఈ ఆందోళనలో నాయకులు రహదారిపై బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డా. ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ భద్రతను తొలగించడం సరైంది కాదని, ఎలాంటి జాప్యం లేకుండా భద్రతను యథాతథంగా పునరుద్ధరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, కోనేరు కోనప్ప అభిమానులు, డా. ఆర్ఎస్. ప్రవీణ్ కుమార్ అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్