కోసిని ప్రభుత్వ పాఠశాల అభివృద్ధికి ఆర్ ఎస్ పీ సూచనలు

కాగజ్నగర్ మండలం కోసిని గ్రామపంచాయతీలోని ప్రభుత్వ పాఠశాలను బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్‌ఎస్‌ ప్రవీణ్ కుమార్, గ్రామ సర్పంచ్ వసాకే హనుమంతుతో కలిసి సందర్శించారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న మౌలిక వసతులను పరిశీలించి, త్రాగునీటి సదుపాయం, ప్లే గ్రౌండ్ అభివృద్ధి, గోడలకు సున్నం వేయడం, బాత్రూముల మరమ్మతులు వంటి పనులను తక్షణమే చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి మౌలిక వసతులు కీలకమని, మెరుగైన విద్యావాతావరణం కల్పించేందుకు పనులు త్వరగా పూర్తి చేస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్