బెజ్జూర్ మండలం ఇందర్గాం సమీపంలోని దట్టమైన అడవిలో వర్షాల ప్రభావంతో సమ్మక్క-సారలమ్మ జలపాతం అందంగా జాలువారుతోంది. గుట్టపై నుంచి కిందికి ప్రవహిస్తున్న నీటి ధారలు పర్యాటకులను, యువతను ఆకట్టుకుంటున్నాయి. స్థానికులు, పర్యాటకులు పెద్ద సంఖ్యలో వచ్చి ఆనందిస్తున్నారు. ప్రభుత్వం దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుతున్నారు.