భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి, కాగజ్‌నగర్ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ సాయి మందిరం, ఎస్పీఎం న్యూ కాలనీలో బుధవారం సాయంత్రం ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో 30 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. విజేతలకు బహుమతి ప్రదానోత్సవం గురువారం, జనవరి 15న సంక్రాంతి పండుగ రోజున సాయంత్రం 7.30 గంటలకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.