కాగజ్‌నగర్‌లోని తన నివాసంలో సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతి సందర్భంగా సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు ఆయన చిత్రపటానికి పూలమాల అర్పించారు. దేశవ్యాప్తంగా సర్దార్ పటేల్ స్పూర్తితో ఏక్తా దివాస్ కార్యక్రమాలు జరుగుతున్నాయని, పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రతి స్టేషన్ పరిధిలో 2కే రన్ నిర్వహిస్తున్నారని తెలిపారు. సర్దార్ పటేల్ జీవితం యువతకు ప్రేరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు పాల్గొన్నారు.