కాగజ్‌నగర్ పాలిటెక్నిక్ ఫ్రీ కోచింగ్ సెంటర్‌లో ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో భాగంగా షీ టీమ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. డీఎస్పీ వాహిదుద్దీన్ ఆధ్వర్యంలో మహిళలు, చిన్నపిల్లల భద్రత, జెండర్ ఈక్వాలిటీ, సైబర్ నేరాలు, బాల్య వివాహాలపై విద్యార్థులకు వివరించారు. బి. ఎన్. ఎస్ చట్టంపై కూడా అవగాహన కల్పించారు. అత్యవసర సమయంలో 100, 112, 1930, 1098 నంబర్లను వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పోలీసులు, అధికారులు పాల్గొన్నారు.