పంట నష్టపోయిన రైతులకు మద్దతుగా నిలిచిన శ్యామ్‌రావ్

కాగజ్‌నగర్ మండలంలోని కోసిని, రేగులగూడ, కూసుగూడ, దరిగాం, వేంపల్లి గ్రామాల్లో అడవి పందుల దాడి వల్ల పత్తి పంట నష్టపోయిన రైతులు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసు వద్ద ధర్నా చేపట్టారు. బీఆర్ఎస్ సిర్పూర్ నియోజకవర్గ కన్వీనర్ లేండుగురే శ్యామ్‌రావ్ ప్రభుత్వం వెంటనే సర్వే నిర్వహించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఎఫ్డీఓ రైతులకు సర్వే చేసి పరిహారం అందించడంతో పాటు సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళన విరమించారు.

సంబంధిత పోస్ట్