కాగజ్‌నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే నివాసం నుండి బోనం ఎత్తుకుని, సర్ సిల్క్ మహంకాళి ఆలయంలో తొలి బోనం సమర్పించారు సిర్పూర్ శాసన సభ్యులు డా. పాల్వాయి హరీష్ బాబు. ఈ సందర్భంగా ఆయన సిర్పూర్ నియోజకవర్గ ప్రజలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. బోనాల ఉత్సవ కమిటీ అధ్యక్షుడు తుమ్మ రమేష్, మున్సిపల్ కమిషనర్ ఎల్పుల రాజేందర్ లను సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పాల్వాయి రాజ్యలక్ష్మి, నాయకులు పాల్గొన్నారు.