హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ప్రజల సమస్యల పరిష్కారం కోసం బీజేపీ భరోసా కార్యక్రమాన్ని సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వారి సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురావడం జరిగింది. అధికారులకు ఉత్తరాలు రాస్తూ, ఫోన్లు చేస్తూ వారి వారి సమస్యలను పరిష్కరించారు. వారు మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారం కోసం జనతా దర్బార్ నిర్వహిస్తున్నామని తెలిపారు.