ఇస్కాన్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్న సిర్పూర్ ఎమ్మెల్యే

దేవ స్నాన పూర్ణిమ సందర్భంగా, సిర్పూర్ ఎమ్మెల్యే డా. పాల్వాయి హరీష్ బాబు హైదరాబాద్ అబిడ్స్‌లోని ఇస్కాన్ ఆలయంలో జగన్నాథ, బలభద్ర, సుభద్రా దేవతలను దర్శించుకున్నారు. అనంతరం రాధా మోహనుల రాజాభోగ హారతిలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఇస్కాన్ సంస్థ నిర్వహిస్తున్న ధార్మిక, దాతృత్వ కార్యక్రమాల గురించి ఆలయ నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ టెంపుల్ మేనేజర్ హనుమంత ప్రభు, అజయ్ ప్రభు, దామోదర్, వంశీ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్