ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు కాగజ్‌నగర్ మార్కెట్ సందర్శన, వ్యాపారులకు భరోసా

నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు గురువారం కాగజ్‌నగర్ పట్టణంలోని మెయిన్ మార్కెట్‌ను సందర్శించారు. ఆయన వ్యాపారవేత్తలు, షాప్ యాజమానులను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. మార్కెట్‌లోని వ్యాపార వాతావరణం, వ్యాపారుల సమస్యలపై ఆరా తీసిన ఎమ్మెల్యే, ప్రభుత్వం తరఫున సాధ్యమైన సహాయాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. పట్టణ అభివృద్ధిలో వ్యాపార రంగం కీలక పాత్ర పోషిస్తుందని, వ్యాపారుల కష్టసుఖాల్లో తమ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్