కోసినిలో ఎర్తింగ్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక చర్యలు

కాగజ్‌నగర్‌ మండలం కోసిని గ్రామపంచాయతీ పరిధిలో ఇళ్లలో ఎర్తింగ్ సమస్యలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటుండటంతో, సర్పంచ్ వసాకే పుల్లాభాయ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. కరెంట్ ఎర్త్ పైపులకు నీరు పోసి ఎర్తింగ్ సక్రమంగా పనిచేసేలా చర్యలు చేపట్టారు. విద్యుత్ భద్రతపై అవగాహన కల్పించారు. లైన్‌మన్ సత్యం, సెక్రటరీ రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఎర్తింగ్ వ్యవస్థను పరిశీలించి అవసరమైన చర్యలు తీసుకున్నారు. గ్రామ ప్రజలు కూడా పాల్గొని సహకరించారు.

సంబంధిత పోస్ట్