గీత జయంతి సందర్భంగా కాగజ్‌నగర్‌లోని కోనేరు కోనప్ప గారి నిత్య అన్నదాన సత్రంలో 108 సార్లు విష్ణు సహస్రనామ పారాయణం, శ్రీకృష్ణ భగవానునికి ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోనేరు కోనప్ప గారి సతీమణి కోనేరు రమాదేవి, పట్టణ మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. భక్తి శ్రద్ధలతో జరిగిన ఈ పూజలు ఆ ప్రాంతంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పాయి.