ఈస్గాం లోని ఎస్‌స్టార్‌ఎస్ ఇటుక బట్టీలో నిర్బంధ శ్రమదోపిడీ జరుగుతుందన్న సమాచారం మేరకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యువరాజ్, డిసిపిఓ బుర్ల మహేష్‌తో కలిసి బాధితులను రక్షించారు. ఒడిశాకు చెందిన బాలింత, మహిళ, 16 ఏళ్ల బాలుడిని కనీస సదుపాయాలు లేకుండా పని చేయిస్తున్నట్టు గుర్తించి సఖీ కేంద్రానికి తరలించారు. యజమానిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.