ఆదివారం: సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష

సివిల్స్ ప్రిలిమినరీ ప్రవేశ పరీక్ష ఆదివారం నిర్వహించనున్నట్లు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ డాక్టర్ రమేశ్ తెలిపారు. హైదరాబాద్-బంజారాహిల్స్‌లోని తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్‌లో పది నెలల ఉచిత రెసిడెన్షియల్ శిక్షణ కోసం దరఖాస్తు చేసిన అభ్యర్థులకు హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ కేంద్రాల్లో ఆఫ్లైన్ పరీక్ష ఉంటుంది. హాల్‌టికెట్‌ను tsstudycircle.co.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి. పరీక్ష కేంద్రానికి అరగంట ముందే చేరుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు 9494149416ను సంప్రదించండి.'

సంబంధిత పోస్ట్