కౌటాలలో తుపాకుల కలకలం నిందితుడి అరెస్ట్

కౌటాల మండలానికి చెందిన ఒక వ్యక్తిని బెదిరించి, 50 లక్షలు డిమాండ్ చేస్తూ లేఖలు రాసి, అతని తమ్ముడిపై కాల్పులు జరిపిన కుర్బంకర్ అజయ్ (31) ను కౌటాల పోలీసులు అరెస్ట్ చేశారు. బీహార్‌లో 55,000 రూపాయలకు పిస్టల్, తుపాకీ, బుల్లెట్లు కొనుగోలు చేసి ప్రాక్టీస్ చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నాడు. బాధితుడిని చంపడానికి ప్రయత్నిస్తున్న సమయంలో, 02.12.2025 ఉదయం ముత్తంపేట క్రాస్ రోడ్‌లో వాహన తనిఖీల్లో పోలీసులు అతన్ని పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి పిస్టల్, తుపాకీ, మ్యాగజైన్లు, 16 బుల్లెట్లు, ఐదు ఖాళీ కోకలు, బైక్, ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తును డీఎస్పి వహిదుద్దీన్ పర్యవేక్షించగా, దర్యాప్తులో కృషి చేసిన అధికారులను ఎస్పి నీతికా పంత్ అభినందించారు.

సంబంధిత పోస్ట్