కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల గ్రామపంచాయతీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. గ్రామ పంచాయతీలకు నిధులు రాక అభివృద్ధి కుంటుపడుతోంది. బెజ్జూర్ మండలం బారెగూడ గ్రామంలో బ్లీచింగ్ పౌడర్ బావుల్లో చేయకపోవడంతో బావుల్లో పురుగులు పెరుగుతున్నాయి. వీధి దీపాలు అమర్చక రాత్రి వేళల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు రోగాల బారిన పడక ముందే అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.