సిర్పూర్(టి) అడవుల్లో పెరుగుతున్న పులుల సంచారం

సిర్పూర్(టి) నియోజకవర్గ పరిధిలోని అటవీ ప్రాంతాల్లో పులుల సంచారం గణనీయంగా పెరిగింది. అడవులకు సమీపంలో ఉన్న గ్రామాల్లో పులులు కనిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇటీవల పలుచోట్ల పులుల కదలికలు నమోదైన నేపథ్యంలో అటవీ శాఖ అప్రమత్తమైంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా రాత్రివేళల్లో ఒంటరిగా తిరగవద్దని అధికారులు సూచించారు. పులుల కదలికలపై నిఘా పెంచి, అవసరమైన భద్రతా చర్యలు చేపడుతున్నట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్